హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రోళ్లు ఇక్కడున్నా బతుకమ్మ ఎత్తుకోరు: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: మన సంస్కృతిని ఆంధ్రా వాళ్లు అణిచి వేయడానికి ప్రయత్నిస్తుంటే తెలంగాణ జాగృతి దానికి జీవం పోసేందుకు కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం టిఆర్ఎస్ భవనంలో అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఊరూరా బతుకమ్మ పోస్టర్‌ను కెసిఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. తెలంగణకు ఎప్పుడో వచ్చామని చెబుతున్న ఒక్క ఆంధ్రా మహిళ అయినా తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మను ఎత్తుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ తదితర పండుగలు సామూహికంగా చేసుకుంటారన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి చురుగ్గా పాల్గొంటుందన్నారు. కోటి బతుకమ్మల కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

మంత్రులు దానం నాగేందర్, శ్రీధర్ బాబు సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల తొత్తులని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు మాటపై నిలబడితే సకల జనుల సమ్మె చేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసే వాడే మా వాడన్నారు. కాగా ఈ నెల 27 నుండి అక్టోబర్ 4వ తేది వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఊరూరా బతుకమ్మ కార్యక్రమంతో కోటి బతుకమ్మల జాగ్రత్త నిర్వహిస్తున్నారు. ఉద్యమం ఐక్యంగానే జరుగుతోందన్నారు. మనమందరం మన లక్ష్యంపైనే దృష్టి సారించాలన్నారు.

English summary
TRS chief K Chandrasekhar Rao, Telangana Jagriti president Kavitha, Telangana political JAC chairman Kodandaram inaugarated koti bathukammala poster today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X