వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యకు జమ్మూ కాశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా విడాకులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Omar Abdullah
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఓ మీడియా అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న కారణంతో ఆయన దాంపత్య జీవితంలో పొరపొచ్చాలు వచ్చాయట. ఓమర్ భార్య పాయల్ ఆయనకు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఓమర్ అబ్దుల్లా, పాయల్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వారిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిద్దరి పెళ్లై పదిహేడేళ్లవుతోంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఓ మీడియా అమ్మాయి కారణంగా వారు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారనే ఆరోపణలు వినిపించినప్పటికీ వేరే కారణాలూ ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓమర్ అబ్దుల్లా ఢిల్లీ వచ్చినప్పుడు తన భార్య పాయల్‌ను దూరం పెడుతున్నారట. ఒమర్ అబ్దుల్లా విడాకుల విషయంపై, రెండో పెళ్లిపై పెద్ద యెత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఓమర్, పాయల్ ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నారని చెబుతున్నారట. వీరి విడాకులకు మీడియా గరల్ ఒక కారణం కాగా రెండో కారణం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజకీయ నాయకుడి చెల్లెలు అనే వాదన కూడా ఉందట. ఓమర్ విడాకులు తీసుకొని మీడియా గరల్‌ను కానీ జమ్మూ కాశ్మీర్ రాజకీయ నాయకుడి చెల్లెలిని కానీ పెళ్లి చేసుకోవచ్చుననే వాదనలు వినిపించినందునే వీరి దాంపత్య జీవితంలో పొరపొచ్చాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓమర్ అబ్దుల్లా జాతీయస్థాయిలో పేరున్న రాజకీయ నాయకుడు. దేశ రాజధాని ఢిల్లీతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకోవడం ద్వారా ఈయన రాజకీయ జీవితంపై కొద్దిగా ప్రభావం పడే అవకాశం ఉంది.

భార్యతో తాను విడిగా ఉంటున్న విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ధృవీకరించారు. అయితే, తన వ్యక్తిగతజీవితంపై, ముఖ్యమంత్రి తన పెళ్లి విషయంపై మీడియా ఊహాగానాలు తనను బాధిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తాకథనాలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు. తన వ్యక్తిగత జీవితంలో సమస్య తలెత్తిన విషయం వాస్తవమేనని, అది తన పనిపై ఏ విధమైన ప్రభావం చూపడం లేదని ఆయన అన్నారు.

English summary
It is official now. Jammu and Kashmir chief minister Omar Abdullah and his wife of 17 years, Payal, have finally decided to split for good. The couple has filed for a divorce by mutual consent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X