వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ

By Pratap
|
Google Oneindia TeluguNews

Ram Charan Teja
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సినీ హీరో రామ్ చరణ్ తేజ గురువారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. కాంగ్రెసు నాయకుడు చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్‌తో కలిసి రామ్ చరణ్ తేజ సిబిఐ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మార్ విల్లాలు కొనుగోలు చేసిన ప్రముఖులను సిబిఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తేజ సిబిఐ కార్యాలయానికి వచ్చారు. ఆయన పేర ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో విల్లా ఉంది. సిబిఐ ఇప్పటికే సినీ హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ ఆఫీస్ బియరర్ చాముండేశ్వరినాథ్ కూడా గురువారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఎమ్మార్ ప్రతినిధులు కూడా సిబిఐ అధికారుల ముందుకు వచ్చారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైయస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి వరుసగా 12వ రోజు సిబిఐ ముందు హాజరయ్యారు. ట్రెండ్ సెట్టర్ బిల్డర్స్ ప్రతినిధులు కూడా సిబిఐ ముందుకు హాజరయ్యారు. కార్మైల్ ఆసియా ప్రతినిధులు కూడా సిబిఐ ముందుకు వచ్చారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో విల్లాలు కొన్నవారిని కేవలం సాక్షులుగానే విచారిస్తున్నట్లు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ ఇది వరకే చెప్పారు.

English summary
Film star Ram Charan Teja attended to CBI to depose on Emaar Properties case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X