హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్య పోటీపై తెలంగాణ టిడిపి భిన్నస్వరాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశ పోటీపై తెలంగాణ తెలుగుదేశం పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లా వెళ్లినప్పుడు బాలయ్యబాబు తాను 2014 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన అలా ప్రకటించారో లేదో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు బాలయ్యబాబు ఇప్పుడు రాజకీయాలలోకి వస్తానన్న తాము తమ పదవులకు రాజీనామా చేసి ఆయనను లక్షల ఆధిక్యంతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటనలు గుప్పించారు. ఆయన కోసం తమ నియోజకవర్గాన్ని వదులుకుంటామని చెప్పారు. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

రెండు రోజుల క్రితం టిడిపి సీనియర్ శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ తాము ప్రస్తుతం బాలయ్య కోసం రాజీనామా చేసి ఆహ్వానించే స్థితిలో లేమని చెప్పారు. అయితే ఇదే తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, కొత్తకోట దయాకర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా గురువారం స్పందించారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ తెలంగాణ బిడ్డలే అని, వారు తెలంగాణ ప్రాంతంలో పోటీ చేస్తానంటే స్వాగతిస్తామని ఎర్రబెల్లి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే కొత్తకోట మరో అడుగు ముందుకేసి బాలయ్య పోటీ చేస్తానంటే తాను గాని, తన భార్య గాని నియోజకవర్గాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యలను ఓ ప్రాంతానికి చెందిన వారుగా చూడవద్దని కోరారు.

English summary
It seems, differences in Telangana Telugudesam Party on Nandamuri Balakrishna political entry. Senior MLAs Errabelli Dayakar Rao and Kothakota Dayakar Reddy were told they are ready to scarifies their seats for Balayya but Jaipal Yadava told he is not ready.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X