హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిటిడిపికి సమ్మె షాక్, జెఏసికి రేవంత్ రాజీనామా లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: సకల జనుల సమ్మెలో భాగంగా శుక్రవారం ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలకు పలుచోట్ల చుక్కెదురయింది. రంగారెడ్డి జిల్లా తాండూరు, వికారాబాద్ తదితర ప్రాంతాలో సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చినప్పుడు ఆందోళనకారులు అడ్డుకున్నారు. తెలంగాణపై పార్టీ వైఖరి చెప్పాకే రావాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో స్థానిక పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ ఫ్లెక్సీని ఆందోళనకారులు చించి వేశారు. టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా టిడిపి సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని న్యాయవాదుల ఐకాస ముట్టడించింది. ఎర్రబెల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందుకు రేవంత్ రెడ్డి తాను ఎప్పుడో రాజీనామా చేశానని దానిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించలేదన్నారు. మీరే ఆమోదింప చేయండని తన రాజీనామా లేఖను ఐకాస నేతలకు ఇచ్చారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా పార్లమెంటులో ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు గుర్తుంచుకోవాలని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ శుక్రవారం అన్నారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. సంకుచిత భావంతో ఆలోచించడం సరికాదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో ఇదే ఆఖరి విమోచన దినం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

English summary
Telanganites gave shock to Telangana Telugudesam Party today. They are obsructed TTDP for strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X