హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబటి రాంబాబుపై విరుచుకుపడుతున్న నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు రాసలీలలపై (అంబటి రాంబాబు రాసలీలల కథనం ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైంది) రాజకీయ నేతలు విరుచుకు పడుతున్నారు. అంబటి రాంబాబును వెంటనే ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నేత వైవి రాజేశ్వరి డిమాండ్ చేశారు. అంబటి వ్యవహారంపై పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఏం చెబుతారని ప్రశ్నించారు. అంబటిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెసు నేత పద్మజారెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయా నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలన్నారు.

రాజకీయాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తగదని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు అన్నారు. ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ నేతలు మయూరి సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. అంబటిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు వ్యవహారాలు నిజమే అయిన పక్షంలో ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తామని విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వైయస్ విజయమ్మ, హోంమంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకు వెళతామన్నారు.

అయితే అంబటి రాంబాబు రాసలీలల వెనుక వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బతీసే కుట్ర ఉన్నదా ఆనే కోణంలో కూడా చూడాలన్నారు. అంబటిపై కుట్ర జరిగుతుందా అనే దృష్టితోనూ ఆలోచించాల్సి ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య సైతం అంబటి రాసలీలల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
CPM demanded to take action on YSRC Party spokes person Ambati Rambabu today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X