హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబటి రాంబాబు 'రాసలీలల'పై జగన్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Ambati Rambabu
హైదరాబాద్: ఎబిఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసిన వైయస్సార్సీ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు రాసలీలల కథనం చూసిన ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏం తామాషాగా ఉందా? అంటూ మండిపడ్డట్టు సమాచారం. పెద్దరికం మరిచిపోయి ప్రవర్తిస్తావా? స్త్రీలను గౌరవించడం కూడా తెలియదా? అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబు కథనం సంచలనం రేకెత్తించడంతో జగన్ అంబటిపై విరుచుకు పడ్డారని తెలుస్తోంది. కాగా కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కఠారి ఇంట్లో ఎబిఎన్ ఛానల్ కథనం చూశారని తెలుస్తోంది.

కాగా తనపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేయడానికి సిద్ధమైందని ఇటీవల తెలిసిన అంబటి రాంబాబు ఆంధ్రజ్యోతితో కాళ్లబేరానికి వెళ్లాడట. ఈ విషయాన్నీ ఛానల్ ప్రసారం చేసింది. ఆంధ్రజ్యోతి ప్రతినిధికి అంబటి స్వయంగా ఫోన్ చేసి తనపై కథనాన్ని ప్రసారం చేయవద్దని కోరారట. అయితే పూర్తి సాక్ష్యాధారాలతో తమ వద్ద ఉందని కాబట్టి తాము ఆపే ప్రసక్తి లేదని చెప్పారట. రాసలీలల వ్యవహారం ఆయన వ్యక్తిగతం అయితే తాము ప్రసారం చేయక పోయే వారమని కానీ రాజకీయాల పేరుతో మేళ్ల మాటున ఇలాంటి అకృత్యాలకు పాల్పడటం వల్లనే తాము ప్రసారం చేస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రజ్యోతి ప్రసారం చేయడానికే సిద్ధమవడంతో తాను వేధించిన మహిళలనూ రాజీ చేసుకునే ప్రయత్నాలు చేశాడట. కానీ అదీ కుదరలేదట.

English summary
YSRC Party president YS jaganmohan Reddy fired at party spokes person Ambati Rambabu for his Rasaleelalu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X