• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు అంబటి సవాల్

By Pratap
|

Ambati Rambabu
హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణల మీద బహిరంగ చర్చకు ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణల మీద తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారా అని ఆయన అన్నారు. తనపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తాకథనాన్ని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. ఏ టీవీ చానెల్ ఎడిటర్ వద్దకైనా తాను చర్చకు వస్తానని ఆయన అన్నారు. ఆయన కొంత మంది ఎడిటర్ల పేర్లు కూడా చెప్పారు.

తనతో చర్చకు రాధాకృష్ణ 24 గంటల్లో చర్చకు రావాలని ఆయన అన్నారు. తనపై కక్షతోనే తప్పుడు వార్తాకథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాధాకృష్ణ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉడత ఊపులకు తాను బెదిరేది లేదని ఆయన అన్నారు. ఎబిఎన్ చానెల్‌పై పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

English summary
YSR Congress leader Amabti Rambabu challenged Andhrajyothy MD Radhakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X