హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబటి రాసలీలల కథనం: హెచ్‌ఆర్‌సికి మంజు ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు రాసలీలల వార్తాకథనంలో తనపై తెరచాటు నుంచి మాట్లాడించిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై మంజు అనే అమ్మాయి రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి (హెచ్‌ఆర్‌సికి) ఫిర్యాదు చేసింది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్‌ఆర్‌సిని కోరింది. దీనిపై వెంటనే స్పందించి వారం రోజుల లోపల నివేదిక సమర్పించాలని హెచ్‌ఆర్‌సి హైదరాబాదులోని కూకట్‌పల్లి ఎసిపిని ఆదేశించింది.

ఆంధ్రజ్యోతి చానెల్ తనను చంపేస్తుందని మంజు భయం వ్యక్తం చేసింది. హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేసిన తర్వాత మంజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడింది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, రిపోర్టర్ క్రాంతి తనను బెదిరించారని ఆమె ఆరోపించింది. తనలాంటి పేదవారికి అన్యాయం జరగకుండా చూడాలని ఆమె మీడియాను కోరింది. వారం రోజుల్లో నివేదిక తెప్పించుకుని, బాధితురాలికి న్యాయం చేస్తామని హెచ్‌ఆర్‌సి హామీ ఇచ్చినట్లు మంజు తరఫు న్యాయవాది చెప్పారు.

English summary
As YSR Congress party leader Ambati Rambabu sex scandal reported by ABN Andhrajyothy took new turn, Manju made complaint against that Channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X