హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబటి రాసలీలలు: ఈమె ఆమేనని అంగీకారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు రాసలీలల కథనంలో తెరచాటున ఉండి మాట్లాడిన అమ్మాయి ఆ తర్వాత తమకు వ్యతిరేకంగా మాట్లాడిన అమ్మాయేనని ఆంధ్రజ్యోతి అంగీకరించింది. ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఆంద్రజ్యోతి దినపత్రికలో శనివారం ఓ వార్తాకథనం ప్రచురితమైంది. తనను ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, రిపోర్టర్ క్రాంతి బెదిరించి తనతో మాట్లాడించారంటూ మంజు అనే అమ్మాయి మీడియా ఎదుటకు వచ్చిన ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. అయితే, అంబటి రాంబాబు బ్రెయిన్ వాష్ చేయడం వల్లనే మంజుల అలా మారిపోయిందని ఆంధ్రజ్యోతి ఆరోపించింది.

ఆంధ్రజ్యోతి మంజుపై ఈ విధంగా వ్యాఖ్యానించింది - అంబటి రాసిచ్చిన అబద్ధాల స్క్రిప్టు ప్రకారం నడుచుకుంది. కానీ.. అంబటి ఆడించిన ఈ నాటకం ఏమాత్రం రక్తి కట్టించలేకపోయింది. ఆ యువతి పేరు మంజుల! బిత్తర చూపులు, తడబడే మాటలు, తడారుతున్న గొంతు, మీడియా ప్రశ్నలకు నీళ్లు నమలడం... మంజుల అబద్ధం చెబుతోందనడానికి ఇవి చాలు.

ఎబిఎన్ తనను బయటకు లాగిందని అంటున్న మంజు తనంత తానే బయటపడిందని ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానించింది. మీడియా విలువలకు కట్టుబడి మంజుల పేరు గానీ, ఆమె ముఖాన్ని గానీ తాము చూపించలేదని ఆంధ్రజ్యోతి వివరణ ఇచ్చింది. అంబటి రాంబాబే ఆమె చేత ఆంధ్రజ్యోతి ఎండీ, సిబ్బందిపై కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయించారని ఆరోపించింది.

English summary
According to Andhrajyothy - Manju has been brain washed by YSR Congress leader Ambati Rambabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X