వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబటి రాంబాబుకి ఆంధ్రజ్యోతి ఎండి ప్రతి సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu and ABN Andhrajytohy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్‌కి ఆంధ్రజ్యోతి ఎండి ప్రతి సవాల్ విసిరారు. తనను టార్గెట్ చేసే లక్ష్యంలో భాగంగా అనవసరంగా ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్న మహిళలను వివాదంలోకి లాగవద్దని అంబటి రాంబాబును హెచ్చరించారు. అంబటి రాంబాబుకు దమ్ముంటే తనతో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ఆయన బెదిరింపులకు లొంగే సమస్యే లేదన్నారు. తన ఛానల్‌లో వచ్చిన కథనాలకు పూర్తి బాధ్యత తనదే అన్నారు. వ్యక్తిగతంగా తనపై ఎంత యుద్ధమైనా చేయండి. కానీ పని చేసే ఇతరులను అనవసరంగా లాగవద్దన్నారు. జర్నలిజం విలువలను దిగజార్చుతూ ఓ రోత పత్రిక, రోత ఛానల్ అంబటికి మద్దతు పలుకుతోందని సాక్షిని ఉద్దేశించి అన్నారు.

అంబటి వంటి వారి బెదిరింపులు అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తన మనోస్థైర్యాన్ని ఇసుమంత కూడా దెబ్బతీయలేవన్నారు. వేమూరికి ఏమైనా జరిగితే తమ బాధ్యత లేదని వైయస్సార్సీ పార్టీ నేతలు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారని, అలాంటి వాటిని ముందే ఊహించానని వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. అన్నింటికి సిద్ధపడే వచ్చానన్నారు. తాను అంబటి అండ్ కంపెనీకి సమాధానం ఇవ్వదల్చుకోలేదని కానీ తన సిబ్బంది, ప్రజల కోసమే వివరణ ఇచ్చుకుంటున్నానన్నారు.

ఆంధ్రజ్యోతిపై విమర్శలు చేస్తున్న అంబటి అండ్ కంపెనీ తమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఓ పత్రిక నడుపుతున్నాడనే విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. మీకు దమ్ముంటే నాపై మీకు ఎంత శక్తి ఉంటే అన్ని ఆరోపణలు చేసుకోండి, మానసికంగా, భౌతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసుకోండి. కానీ పొట్టకూటి కోసం వచ్చిన మహిళలను మాత్రం లాగొద్దన్నారు. కాగా శనివారం ప్రెస్ మీట్ పెట్టిన అంబటి రాంబాబు మహిళలను వివాదంలోకి లాగిన విషయం తెలిసిందే.

English summary
ABN Andrhajyothy MD challenged YSRC Party spokes person Ambati Rambabu today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X