వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం మరో ఎమ్మెల్యే రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nalgonda District Map
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఆదివారం మరో శాసనసభ్యుడు రాజీనామా చేశారు. నల్గొండ జిల్లా నకిరెకల్ నియోజకవర్గం శాసనసభ్యుడు చిరుముర్తి లింగయ్య తన రాజీనామా సమర్పించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసమే రాజీనామా చేసినట్లు చెప్పారు. ఉద్యమంలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో రాజీనామా సమర్పించానన్నారు. తమ పార్టీ ఆంధ్రా నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. తాను స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా సమర్పించినట్లు చెప్పారు.

అయితే శనివారమే ఆయన రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పటికి ఆయన తన రాజీనామాపై ఖండించలేదు, ధృవీకరించలేదు. ఆదివారం ఆయన తన రాజీనామాను ధృవీకరించారు. కాగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఆలంపూర్ కాంగ్రెసు శాసనసభ్యుడు అబ్రహం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా ముగ్గురు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో తెలంగాణవాదులు మిగిలిన శాసనసభ్యులపై మరింత ఒత్తిడి చేసే దిశలో కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.

English summary
MLA Chirumurthi Lingaiah resigned for his post today for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X