హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వ్యాఖ్యలపై స్పందించరేం?: సీమాంధ్రులపై పొన్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు గడ్డి తింటున్నారని, దరిద్రపు మంత్రులని వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసినా సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సోమవారం ఓ టీవీ ఛానల్‌ కార్యక్రమంలో ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు చీము నెత్తురు లేదన్నారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తదితరులు తెలంగాణవాదులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సకల జనుల సమ్మె తీవ్రతను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లడమే ఇప్పుడు మా ముందున్న ఏకైక అజెండా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెపై సరైన నివేదికను కేంద్రానికి ఇవ్వడం లేదన్నారు.

తెలంగాణపై కేంద్రం స్పందించక పోతే ఈ ప్రాంతంలో తాము శవాలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాము కాంగ్రెసు పార్టీని వీడేది లేదన్నారు. తెలంగాణ ఇప్పుడు సాధించకుంటే భవిష్యత్తు తరాలకు నష్టం చేసిన వారమవుతామన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీని కాపాడుకుంటూనే తెలంగాణ సాధిస్తామన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు అధిష్టానాన్ని బెదిరిస్తున్నారని కానీ తాము మాత్రం పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తమ గోడు అధిష్టానం వింటుందన్న నమ్మకముందన్నారు.

తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే జై తెలంగాణ అన్నానని ఎమ్మెల్యే ముత్యం రెడ్డి వేరుగా అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసింది తెలంగాణ నేతలేనని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము రాజీనామా చేసినా వాటిని ఆమోదించే పరిస్థితి లేదన్నారు. సకల జనుల సమ్మెలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేస్తే బావుండేదని ముత్యం రెడ్డి అభిప్రాయపడ్డారు. సమ్మె ద్వారా మీరే నష్టపోతారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని మరో ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదన్నారు. సమ్మె తీవ్రతను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామన్నారు.

English summary
MP Ponnam Prabhakar questioned Seemandhra leaders that why they are not responding on YSRC Party president YS Jaganmohan Reddy comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X