హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేణుకా చౌదరి సమైక్యవాది: నాగం జనార్ధన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి సమైక్యవాదని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం విమర్శించారు. గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నాగం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడారు. రేణుకా చౌదరి తెలంగాణ ప్రజలను అవమానపర్చేలా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ సాధన కోసం కార్మికులు, ఉద్యోగులు అందరూ ముందుండి ఉద్యమం నడిపిస్తున్నారని వారిని ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తే బావుండదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సకల జనుల సమ్మె కారణంగా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారని అది సరికాదని తెలంగాణ ఇవ్వడమే ప్రత్యామ్నాయమనే విషయాన్ని గుర్తించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత, ప్రజా గాయకుడు గద్దర్ సూచించారు. హింసతో ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. శాంతియుతంగా ఉద్యమం జరుగుతోందన్నారు.

నిజాం కళాశాలలో చదివిన ముఖ్యమంత్రి అదే నిజాం కళాశాలలో చదువుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిపిస్తారా అని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు వేరుగా ప్రశ్నించారు. లాఠీఛార్జ్‌కు బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నట్టుగా ఆర్టీసి, ఉద్యోగులది రెండు రోజుల సమ్మె కాదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ వచ్చే వరకు నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు కాంట్రాక్టు ఉద్యోగులు భయపడవద్దన్నారు. రేణుకా చౌదరికి దమ్ముంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.

English summary
Nagarkurnool mla Nagam Janardhan Reddy accused today that AICC spokes person Renuka Choudary in samaikyavadhi. He continuing that she is blaming Telanganites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X