వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి చిక్కుల్లో చిదంబరం: బయటపడిన ప్రణబ్ లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

pranab mukherjee
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. దీంతో ప్రస్తుత కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చిక్కుల్లో పడినట్లే. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపు వ్యవహారాల్లో చిదంబరం పాత్రను తప్పు పడుతూ ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది మార్చిలో ఓ లేఖ రాశారు. ఆ లేఖ బయటకు వచ్చింది. 2జి స్పెక్ట్రమ్‌ను మొదట వచ్చిన వారికి మొదట అంటూ తక్కువ ధరకు కేటాయించడానికి బదులు వేలం వేయాలని చిదంబరం సూచించి ఉండాల్సిందని అంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ లేఖ రాసింది.

చిదంబరం 2008లో 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగినప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రక్రియలో పారదర్శకత కోసం అప్పటి టెలికం మంత్రి ఎ రాజా నిర్ణయాన్ని కాదని ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాసిన లేఖను జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యన్ స్వామి బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్రపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన ఆ లేఖను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించారు.

English summary
Finance Minister Pranab Mukherjee questioned Home Minister P Chidambaram for his role in the 2G Spectrum case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X