వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం రాజీనామాకు అంబటి రాంబాబు డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం రాజీనామా చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకు చిదంబరం రాజీనామా చేసి సిబిఐ విచారణకు సిద్ధం కావాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో టెలికాం మాజీ మంత్రి ఎ రాజా ఒక్కరినే బలిపశువును చేయడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితులుగా ఉండేవారని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయని ఆయన అన్నారు. గడువు ముగిసిన తర్వాత కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలకు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షంతో కలిసి ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
YSR Congress leader Amabati Rambabu demanded resign Chidambaram in 2G spectrun scam allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X