• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిబిఐకి చిక్కిన గాలి జనార్ధన్ రెడ్డి పిఏ?

By Srinivas
|

Gali Janardhan Reddy
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి పిఎను సిబిఐ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. కర్నాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా హర్పనహళ్లిలో సిబిఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఆయనను అరెస్టు చేసిన సిబిఐ అధికారులు అదే రోజు రాత్రి హైదరాబాదుకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గాలి అరెస్టు అనంతరం పదహారు మంది ఆయన అనుచరులకు సిబిఐ నోటీసులు పంపింది. గాలి సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. గాలి సన్నిహితుల ఇళ్లలో ఇంకా సోదాలు కొనసాగిస్తోంది.

అయితే నోటీసులు పంపినప్పటి నుండే గాలి పిఏ ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. సదరు పిఏ తొలుత బ్రాహ్మణిలో పని చేసి తర్వాత్తర్వాత గాలి వద్ద పిఏగా చేరారు. ఆ సమయంలో ఈయన స్థాపించిన ఓ సంస్థలో గాలి సతీమణి అరుణ భాగస్వామి అయ్యారట. ఆ తర్వాత గాలితో సదరు పిఏకి సంబంధాలు పెరిగాయని సమాచారం. ఇరువురి మధ్య ఉన్న సంబంధాల కారణంగా సదరు పిఏను పట్టుకోవడం కోసం సిబిఐ చాలా రోజులుగా గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మంగళవారం రాత్రి ఎట్టకేలకు దొరికి పోయాడట.

English summary
The roumers were come that Gali Janardhan Reddy PA was arrested by CBI officers on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X