• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By Srinivas
|

High Court
హైదరాబాద్: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ వన్ మెయిన్స్ నిలిపి వేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ నెల 25న జరగాల్సిన గ్రూప్ వన్ మెయిన్స్ యధావిథిగా జరగనున్నాయి. కటాఫ్ మార్కులు 85 మార్కుల నుండి 83 మార్కులకు తగ్గించింది. అయితో నోటిఫికేషన్‌లో ఉన్న పోస్టులనే భర్తీ చేయాలని అదనపు పోస్టుల భర్తీకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. గత నోటిఫికేషన్‌లో ఇచ్చిన పోస్టులనే భర్తీ చేయాలని ఆదేశించింది. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గ్రూప్ వన్ పరీక్షల వాయిదాకు అయిష్టతతో ఉన్న విషయం తెలిసిందే.

సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం అవుతున్న ఈ సమయంలో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయాలంటూ తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు గురువారం ముఖ్యమంత్రిని కలిసి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే అది మన చేతుల్లో లేదని తేల్చి చెప్పారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ నేతలు గ్రూప్ వన్ వాయిదా బాధ్యతలు మంత్రులపై వేశారు. కాగా పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా లేరని ఒకవేళ విద్యార్థులు సిద్ధంగా ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేవని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. ఈ విషయమై ఎపిపిఎస్సీ చైర్మన్‌ను కలుస్తామన్నారు. పరీక్షలు నిర్వహిస్తే ముఖ్యమంత్రిని తెలంగాణ వ్యతిరేకిగా చూడాల్సి ఉంటుందన్నారు.

English summary
High Court gave green signal to group-1 mains. Exams will held on 25th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X