హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-Ambati Rambabu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై, ఆ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైంది. తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుదమల్ల వెంకటస్వామిని దూషించినందుకు హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాదులోని గాంధీనగర్ పోలీసులు బుధవారం రాత్రి ఆ కేసు నమోదు చేశారు. జగన్ ఫీజు పోరు సందర్భంగా తనను జగన్, అంబటి దూషించారని వెంకటస్వామి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 15వ తేదీన తాము పోలీసులకు దరఖాస్తు చేసుకోగా 17 నుంచి 21వ తే దీ వరకు రిలే నిరాహార దీక్షలు చేసుకోవడానికి ఆ రోజే అనుమతి ఇచ్చారని సుదమల్ల వెంకటస్వామి గురువారం రాత్రి మీడియా ప్రతినిధులకు తెలిపారు. 17వ తేదీ నుంచి 19 వరకు దీక్షలు సజావుగానే సాగాయని, 18వ తేదిన 'ఫీజు ఫోరు' నిమిత్తం ఒకరోజు అనుమతి తీసుకున్న జగన్ ఇందిరాపార్కు వద్ద దీక్ష చేశారని తెలిపారు. ఆ సమయంలో జగన్ దీక్షకు వచ్చిన తెలంగాణవాదులు తమకు మద్దతు తెలపడాన్ని ఓర్వలేక 20వ తేదీ ఉదయం కల్లా తమ టెంట్‌ను తొలగించారని చెప్పారు.

తాను, తమ పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబును అడిగితే - "మీది ఒకపార్టీనేరా, పోరాపో'' అంటూ కులంపేరుతో దూషించారని, అంతలోనే శిబిరంలో ఉన్న జగన్‌కూడా "ఎవడ్రా అది అక్కడి నుంచి పంపించేయండి'' అంటూ దురుసుగా ప్రవర్తించి దూషించారని వివరించారు. దీనిపై సుదమల్ల వెంకటస్వామి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ పార్టీ వేసుకున్న టెంట్‌ను తొలగించడం, కులంపేరుతో దూషించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని హైకోర్టు గాంధీనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

English summary
SC, ST atrocities case was filed against YSR Congress party president YS Jagan and leader Ambati Rambabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X