వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాన్సువాడ ఉప ఎన్నికపై చేతులెత్తేసిన చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని నిలిపే విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. పార్టీ తెలంగాణ నాయకులు శనివారం చంద్రబాబుపై సమావేశమై బాన్సువాడ ఉప ఎన్నికపై చర్చించారు. బాన్సువాడలో అభ్యర్థిని నిలిపే విషయంపై నిర్ణయాన్ని చంద్రబాబు పార్టీ తెలంగాణ ఫోరం నాయకులకు వదిలేశారు. ఇది చంద్రబాబు మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధమైన విషయం. పార్టీ అభ్యర్థిని నిలిపే విషయంపై నిర్ణయాన్ని చంద్రబాబు తమకే వదిలేశారని పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

బాన్సువాడలో అభ్యర్థిని నిలిపే విషయంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఈ ప్రాంతంలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము ప్రతిపాదిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభకు ఎన్నకైన పోచారం శ్రీనివాస్రెడ్డి పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో బాన్సువాడ ఉప ఎన్నిక జరుగుతోంది. పోచారం శ్రీనివాస రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమతి (తెరాస)లో చేరి ఆ పార్టీ తరఫున నామినేషన్ కూడా వేశారు. కాంగ్రెసు పార్టీ శ్రీనివాసగౌడ్‌ను పోటీకి దించింది. ఆయన కూడా నామినేషన్ వేశారు. ఈ స్థితిలో ఏం చేయాలనే విషయంపై తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

English summary
TDP president N Chandrababu Naidu has left the decission to Telangana leaders on Banswada bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X