వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రైతులపై ముఖ్యమంత్రి కుట్ర: హరీష్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రైతులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ కోత విధిస్తూ ముఖ్యమంత్రి తెలంగాణ రైతులను మోసగిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. సీమాంధ్రలో రెండు గంటలే కరెంట్ కోత విధిస్తూ తెలంగాణలో నాలుగు గంటలు కోత విధిస్తున్నారని, ఈ పని ఉద్దేశ్యపూర్వకంగానే ముఖ్యమంత్రి చేస్తున్నారని, హైదరాబాదులోని విద్యుత్ సౌధ నుంచే కరెంట్ కోత విధిస్తున్నారని ఆయన అన్నారు.

సీమాంధ్రలోని ఒక్క పరిశ్రమకు కూడా విద్యుత్తు కోత విధించడం లేదని, తెలంగాణలో మాత్రం ఆరు గంటలు మాత్రమే విద్యుత్తు ఇస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలోని రైతులకు ఏడు గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఇళ్లలో విద్యుత్ లేకపోయినా ఫరవాలేదు గానీ వ్యవసాయానికి కావాలని ఆయన అన్నారు. తెలంగాణలోని పంటలు ఎండిపోతున్నా తెలంగాణ మంత్రులు పదవుల్లో ఎలా కొనసాగుతున్నారని, ముఖ్యమంత్రిని ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలో ఒక్క ఎకరం పంట ఎండిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రిజర్వాయర్లలో నిండా నీళ్లు ఉన్నా జలవిద్యుదుత్పత్తి జరపడం లేదని, జల విద్యుదుత్పత్తికి కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. విద్యుత్తు కోత ఇలాగే కొనసాగితే ముఖ్యమంత్రి ఇంటిని, విద్యుత్తు సౌధను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

English summary
TRS MLA Harish Rao criticised that VM Kirankumar Reddy has consired against Telangana farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X