వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాస్ ఇవ్వొద్దని జైపాల్ రెడ్డికి చెప్పొచ్చారు: ముఖ్యమంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ నాయకులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఆగ్రహాన్ని పరోక్షంగా వెళ్లగక్కారు. సమ్మె జరుగుతున్న నేపథ్యంలో తాను తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలకు అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. గ్యాస్ కావాలని అడిగితే ఇవ్వొద్దని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి తెలంగాణ నాయకులు చెప్పొచ్చారని ఆయన శనివారం తన క్యాంపు కార్యాలయంలో మెదక్ జిల్లా నుంచి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు తెప్పిస్తుంటే రైల్ రోకో చేపట్టారని ఆయన అన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని ఆపించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూసి సంతోషిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని, రెండు మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ఇది వరకే చెప్పిందని ఆయన అన్నారు. సమ్మె వల్ల ఆర్టీసికి ఎంతో నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఏదైనా చేస్తే ప్రజలకు మేలు కలగాలని, అన్యాయం చేస్తున్నవారిని ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన చెప్పారు. రూపాయికి కిలో బియ్యం పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడు నెలల క్రితమే అంగీకరించినట్లు ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాకు 15 రోజుల క్రితమే 80 క్వింటాళ్ల విత్తనాలు పంపామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాసిన లేఖకు ఇచ్చిన సమాధానంలో ఆయన చెప్పారు. సమ్మె విరమించాలని ఆయన కోరారు.

English summary
CM Kirankumar Reddy expressed his unhappiness with Telangana leaders for obstructing alternative arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X