వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సకల జనుల సమ్మెకాదు, సకల కష్టాల సమ్మె: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: తెలంగాణలో జరుగుతున్నది సకల జనుల సమ్మె కాదని, అది సకల కష్టాల సమ్మె అని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. రైల్ రోకో సందర్భంగా విజయవాడలో ఆగిపోయిన ప్రయాణికులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమ్మె వల్ల నష్టపోతున్నది తెలంగాణ ప్రజలేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలోని 90 శాతం మంది ప్రజలు సమ్మెను ఆమోదించడం లేదని ఆయన చెప్పారు.

ప్రభుత్వం సహనం, శాంతితో వ్యవహరిస్తోందని, భావోద్వేగాల సమస్య కాబట్టి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. త్వరలో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్ రోకో వల్ల సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్ప ప్రయోజనం ఏమీ లేదని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. తెలంగాణపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్టానానిదేనని ఆయన అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని ఆయన గుంటూరులో శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో అన్నారు.

English summary
Congress Vijayawada MP Lagadapati rajagopal deplored Telangana stir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X