వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపాల్ రెడ్డికి గ్యాస్ ఇవ్వొద్దని ఎవరూ చెప్పలేదు: మందా

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Jagannatham
న్యూఢిల్లీ: రాష్ట్రానికి గ్యాస్ ఇవ్వవద్దని ఎవరూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి చెప్పలేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం స్పష్టం చేశారు. గ్యాస్ ఇవ్వవద్దని జెపాల్ రెడ్డికి కొంత మంది చెప్పారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. రవాణా సౌకర్యాలు లేవని, అయినా గ్రూప్ వన్ పరీక్షను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం దారుణమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గ్రూప్ వన్ పరీక్షలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ సకల జనుల సమ్మెపై కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. సకల జనుల సమ్మె వల్ల పనులన్నీ ఆగిపోయాయని, పాలన స్తంభించిందని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని మరో పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లే ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. మధుయాష్కీతో పాటు కొంత మంది తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రక్షణ మంత్రి ఎకె ఆంటోనీని కలిశారు.

English summary
Congress Telangana region MP Manda Jagannatham condemned CM Kirankumar Reddy's statement on gas supply issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X