వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలోనే భానుకిరణ్, తెలంగాణలో ఓకే: డిజిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

DGP Dinesh Reddy
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి ప్రధాన నిందితుడు భానుకిరణ్ రాష్ట్రంలోనే ఉన్నట్లు సమాచారముందని రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు దినేష్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో చెప్పారు. ఆందోళనలు హింసాత్మకంగా మారితేనే పోలీసులు కలుగజేసుకుంటారని అన్నారు. తెలంగాణలోని సకల జనుల సమ్మెలో ఎలాంటి హింసాత్మకం, ఆస్తి నష్టం జరగలేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేసే ఆందోళనలను పోలీసులు అడ్డుకోరన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. ప్రాంతాలకతీతంగా ఎక్కడైనా పరిస్థితులు చేయి దాటినప్పుడే పోలీసులు రంగ ప్రవేశం చేస్తారన్నారు. అది మేము చేతల్లోనూ చూపిస్తున్నామన్నారు.

పరిధులు దాటకుండా ఎన్ని కార్యక్రమాలైనా చేపట్టవచ్చన్నారు. శాంతిభద్రతల కోసమే కేంద్ర బలగాలన్నారు. సకల జనుల సమ్మెలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. నిజాం కళాశాలలో జరిగిన అంశంపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోందన్నారు. తెలంగాణలో పోలీసులకు కొరత లేదన్నారు. రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారన్నారు. త్వరలో నూతన పోలీసు పోస్టులను భర్తీ చేస్తామని, అలాగే నెలలోపే ఎస్సై అభ్యర్థుల శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు.

మూడు రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. పేకాట క్లబ్బులను చాలా వరకు నిరోధించినట్లు చెప్పారు. పోలీసు కానిస్టేబుల్స్ అలవెన్సులు పెరిగాయన్నారు. వేతనాల సవరణ అవసరం ఉందన్నారు. గ్రూప్-1 పరీక్ష కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చత్తీస్‌ఘడ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాదుల చర్యలు పెరిగాయన్నారు. అయితే రాష్ట్రంలో తీవ్రవాద సమస్య అదుపులో ఉందని చెప్పారు. రాజమండ్రి నుండి త్వరలో మానవరహిత విమానాన్ని వినియోగిస్తామని చెప్పారు.

అక్టోబరు నుండి ఇది వినియోగించే అవకాశముందన్నారు. దీనివల్ల అడవుల్లో తీవ్రవాద చర్యలను పసిగడుతుందన్నారు. అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో తీవ్రవాద చర్యలను పసిగట్టే అవకాశం ఉందన్నారు. ఈ విమానం ఖర్చు నెలకు కోటి రూపాయలు ఉంటుందన్నారు. మానవ రహిత విమానం ద్వారా ఫోటోలు తీసి తీవ్రవాదుల కదలికలు గమనిస్తామన్నారు.

English summary
DGP Dinesh Reddy suspected that Bhanu Kiran, who accused in Maddelachervu Suri murder case is in state. He said that there is no tension in Telangana region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X