వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బర్త్ డే పార్టీ అంత ఈజీ కాదు: అసదుద్దీన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: రాష్ట్ర విభజన బర్త్ డే పార్టీ అంత ఈజీ కాదని హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ చెప్పిన దానికి తాము కట్టుబడి ఉన్నామని, తమ అభిప్రాయాన్ని కమిటీకి చెప్పామన్నారు. బందులకు, సమ్మెలకు, హింసకు తాము వ్యతిరేకం అన్నారు. సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలన్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయంగా లబ్ధి పొందేది భారతీయ జనతా పార్టీయే అన్నారు. ఎన్నికల ముసాయిదాలో తెలంగాణను చేర్చిన పార్టీలను ప్రజలు నిలదీయాలని సూచించారు. సమ్మెకు మా మద్దతు లేదన్నారు. అయితే తెలంగాణ కోసం అన్నాహజారే తరహా ఉద్యమం చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. యువత, పోలీసుల తీరు చూస్తుంటే భవిష్యత్తులో హింసకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. హజ్ యాత్రికులకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు.

English summary
Hyderabad MP Asaduddin said today that state seperation is not like birth day party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X