వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్ రోకో: పట్టాలపై నిద్ర, బోరు వద్దే ఎమ్మెల్యే స్నానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి రెండు రోజుల రైలు రోకో పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు శనివారం మెదక్ జిల్లాలోని మనోహరాబాదు రైల్వే పట్టాల పైనే రాత్రంతా పడుకున్నారు. ఆ తర్వాత ఉదయం పక్కనే ఉన్న బోరు బావి వద్ద స్నానం చేశారు. తర్వాత కార్యకర్తలతో కలిసి అక్కడే ఫలహారం తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై విరుచుకు పడ్డారు. తెలంగాణలో పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రికి పట్టడం లేదని హరీష్ రావు మెదక్ జిల్లాలో విమర్శించారు. సమ్మె సాకుతో తెలంగాణలోని వ్యవసాయానికి ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయడం లేదని విమర్శించారు. రైల్ రోకోకు తెలంగాణలోని రాజకీయ ఐకాస మరోసారి పిలుపునిస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల్లో పలువురు తెలంగాణవాదులు పట్టాల పైనే టెంటు వేసి రాత్రంతా అక్కడే ఉన్నారు. అక్కడే భోజనాలు చేశారు.

కొరతల పేరుతో సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి విషపూరిత ప్రచారం చేస్తున్నారని హైదరాబాదులో బిజెపి సీనియర్ నేత దత్తాత్రేయ మండిపడ్డారు. కిరణ్ ఆంధ్ర సిఎంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న సిఎం ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నుంచి బలగాలను తెప్పించడం కాదని వాస్తవ పరిస్థితులను కేంద్రానికి నివేదిస్తే చాలన్నారు. ఎపిలో గందరగోళానికి కాంగ్రెస్సే కారణమని వాళ్లే పరిష్కారం చూపాలని వెంకయ్య నాయుడు ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. పరిస్థితులను చక్కదిద్దే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయన్నారు.

English summary
Siddipet MLA Harish Rao slept at Manoharabad railway station last night for support Telangana JAC rail roko.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X