వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదమూడో రోజుకు చేరిన సకల జనుల సమ్మె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: సకల జనుల సమ్మె ఆదివారం పదమూడో రోజుకు చేరుకుంది. తెలంగాణవ్యాప్తంగా పది జిల్లాల్లో రైళ్లు, ఆటోలు, బస్సులు సంపూర్ణంగా బందయ్యాయి. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, తెలంగాణలోని అన్ని రకాల ఉద్యోగులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఆటో, ఆర్టీసీ డ్రైవర్లు బందు కొనసాగిస్తున్నారు. 48 గంటల రైలు రోకో కార్యక్రమం మొదటి రోజు విజయవంతం కావడంతో మరో నలభై ఎనిమిది గంటలకు దానిని పెంచి తెలంగాణ పట్ల ప్రజల కోరికను కేంద్రానికి తెలియజెప్పే ఉద్దేశ్యంతో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఉంది. అయితే మరోవైపు అన్ని చక్రాలు ఆగి పోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా ఆదివారం ప్రారంభమైన గ్రూప్-1 పరీక్షలకు అభ్యర్థులు తమ తమ సొంత వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ అవి అంతగా ఫలించలేదు. ఎక్కడికక్కడ బందు ఉండటంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి వచ్చారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతా బలగాలను ఉంచారు. ఒక్కో పరీక్ష కేంద్రం వద్ద ఒక్కో ఐపిఎస్ అధికారని ఉంచారు.

English summary
Sakala Janula Strike in Telangana continuing on thirteenth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X