వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రిపై మరోసారి ఎగిరిపడ్డ శంకర్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మాత్యులు శంకర్ రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మరోసాగి ఎగిరి పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ చెప్పకుండా అన్ని నిర్ణయాలను ఆయన సొంతగానే తీసుకుంటున్నారని విమర్శించారు. రూ.1 కిలో బియ్యం ఎవరికీ చెప్పకుండా, మంత్రులతో సంప్రతించకుండా తనకు తానే ప్రకటించారని ధ్వజమెత్తారు.

కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో మంత్రులను సంప్రదించాల్సి ఉంటుందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి సైతం ఆ విషయం తెలియదన్నారు. ఈ అంశాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్లేందుకు లేఖ రాసినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. మల్కాజిగిరి శాసనసభ్యుడు సర్వే సత్యనారాయణ ఏం సేవ చేశారని ఆయన ప్రశ్నించారు. కాగా ముఖ్యమంత్రి రూ.1 కిలో బియ్యం ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కూడా తెలియకుండా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శ్రీధర్ బాబు అలగడం మరో మంత్రి రఘువీరా రెడ్డి ఆయనను బుజ్జగించడం కూడా జరిగింది.

English summary
Minister Shankar Rao targetted CM Kiran Kumar Reddy again. He accused CM Kiran for Rs.1 Kilo rice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X