వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్కామ్‌లో చిదంబరాన్ని ఇరికిస్తున్న రాజా

By Pratap
|
Google Oneindia TeluguNews

A Raja
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో హోం మంత్రి పి. చిదంబరాన్ని ఇరికించేందుకు టెలికాం మాజీ మంత్రి ఎ రాజా ప్రయత్నిస్తున్నారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన అన్ని విషయాలు చిదంబరానికి తెలుసునని రాజా తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ సోమవారం కోర్టుకు తెలిపారు. చిదంబరాన్ని తాను నిందితుడిగా ముందుంచడానికి ప్రయత్నించడం లేదని అన్నారు. చిదంబరాన్ని తాను నిందితుడని అనడం లేదని, కానీ అన్ని విషయాలూ చిదంబరానికి తెలుసునని ఆయన అన్నారు.

చిదంబరం వాంగ్మూలాన్ని 2010 సెప్టెంబర్‌లోనే తీసుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. చిదంబరం, రాజాల మధ్య ఏ విధమైన భేదాభిప్రాయం లేదని, కేటాయింపుల నిర్ణయం మంత్రివర్గం తీసుకున్నదని, అందువల్ల మంత్రివర్గంపై విచారణ జరగాలని ఆయన అన్నారు. చిదంబరాన్ని సాక్షికి కోర్టుకు పిలవాలని ఆయన కోరారు. ప్రధాని సమక్షంలో చిదంబరం సలహా ఇచ్చారా లేదా అనేది కోర్టు తేల్చాలని ఆయన అన్నారు.

నిందితులందరికీ జైలు శిక్ష విధించాలని కోరుతూ సిబిఐ 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ అంతకు ముందు తాజా అభియోగాలు మోపింది. నిందితులకు అత్యధికంగా ఏడేళ్లు జైలు శిక్ష పడేలా సిబిఐ అభియోగాలు మోపింది.

English summary
Former telecom minister A Raja's lawyer, Sushil Kumar, on Monday told the court that Union Home Minister P Chidambaram was a party to all the decisions taken in connection with the 2G spectrum allocation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X