వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాతో భేటీ, రాజీనామాకు చిదంబరం రెడీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

P Chidambaram, Sonia Gandhi and Pranab Mukharjee
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కాంగ్రెసు మెడకు చుట్టుకుంటోంది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ హోం మంత్రి చిదంబరాన్ని తప్పుపడుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. చిదంబరం సోమవారం సాయంత్రం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని టీవీ చానెల్స్‌లో వార్తలు వచ్చాయి. 2జి స్పెక్ట్రమ్ దుమారంపై ఆయన సోనియాకు వివరించినట్లు సమాచారం. పార్టీకి చెడు పేరు రాకుండా తాను రాజీనామా చేస్తానని ఆయన సోనియాతో చెప్పినట్లు సమాచారం. మీడియాతో మాట్లాడడానికి చిదంబరం నిరాకరించారు.

కాగా, అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన ప్రణభ్ ముఖర్జీ కూడా సోనియాను కలిశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులపై తన మంత్రిత్వ శాఖ ప్రధానికి రాసిన లేఖపై చెలరేగిన దుమారంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. తాను చెప్పాల్సింది ఆదివారమే చెప్పానని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై తన మంత్రిత్వ శాఖ రాసిన లేఖపై వివరణ ఇవ్వడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ప్రధాని అమెరికా నుంచి మంగళవారం తిరిగి వచ్చిన తర్వాత అది ఉంటుందని ఆయన చెప్పారు. చిదంబరం తనకు విలువైన సహచరుడని ప్రణబ్ అన్నారు.

చిదంబరం పాత్రపై ఎ రాజా న్యాయవాది కూడా సోమవారం కోర్టులో మాట్లాడారు. చిదంబరానికి అన్ని విషయాలూ తెలుసునని ఆయన అన్నారు. చిదంబరాన్ని కోర్టుకు పిలిపించి అడిగితే వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

English summary
Home Minister Palaniappan Chidambaram offered to resign on Monday, according to TV reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X