విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2న తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేల రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చే నెల 2వ తేదీన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో ఆ విషయం చెప్పారు. తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇక దాగుడుమూతలు ఆడలేరని ఆయన అన్నారు. ఈ నెలాఖరున తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రాకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన అన్నారు. అవసరమైతే రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే సహించేది లేదని ఆయన అన్నారు.

తెలంగాణ వచ్చే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యోగులు భయపడవద్దని, వారి వెంట తాము ఉన్నామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను వేధిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన రోజే నిజమైన పండుగ అని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు.

English summary
Congress Telangana MLA R Damodar Reddy said that they will resign on October 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X