హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజన కేక్ కట్ చేయడమంత సులభం కాదు: అసదుద్దీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించడమంటే బర్త్‌డే కేక్‌ను కట్ చేయడం కాదని, రాష్ట్ర విభజనతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయని గమనించాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల బీజేపీకి మాత్రమే ప్రయోజనం కలుగుతుందని మజ్లీస్ హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సకల జనుల సమ్మెను ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పుపట్టారు. సమ్మెలను తామెప్పుడూ సమర్థించలేదని చెప్పారు. సకల జనుల సమ్మెతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన అబిప్రాయపడ్డారు. సమ్మె ఇలాగే కొనసాగితే దారి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సమ్మె వల్ల అన్ని వర్గాలూ నష్టపోతున్నాయని, హైదరాబాద్‌లో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది దినసరి కూలీలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల బీజేపీకి మాత్రమే లాభమన్నారు. అంత మాత్రాన ఆ పార్టీని చూసి తామేమీ బెదరడం లేదని స్పష్టం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒక సీటుకు మాత్రమే పరిమితమైందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరిని ఇదివరకే శ్రీకృష్ణ కమిటీకి స్పష్టం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు రాజకీయ నాయకులు డెడ్‌లైన్లు పెట్టడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతలు కొందరు నెల రోజుల్లో తెలంగాణ వస్తుందని, రెండు నెలల్లో వస్తుందని అనడం వల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయని చెప్పారు. సకల జనుల సమ్మెలో హజ్ యాత్రికులకు ఇబ్బందులు కలిగిస్తే మజ్లిస్ నాయకులు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సందర్భంలో తాము తెలంగాణ అంశాన్ని ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.

English summary
MIM Hyderabad MP Asaduddin Owaisi said that it is not easy to divide state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X