హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాసలీలల కథనం: రాధాకృష్ణపై హైకోర్టుకు అంబటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: తనపై రాసలీలల కథనాన్ని ప్రసారం చేసిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతిపై, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. కేబుల్ టీవీ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టంలోని నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై పోలీసులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన సోమవారం హైకోర్టును కోరారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలతో కుమ్మక్కయి ఆ చానెల్ తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసినా ఆ చానెల్‌పై పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

ఎబిఎన్ చానెల్ తీరుపై విచారణ జరిపేలా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లను ఆదేశించాలని కోరుతూ అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిని, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ, హోం శాఖ కార్యదర్శి, హైదరాబాదు పోలీసు కమిషనర్‌లను ఆయన ప్రతివాదులుగా చేర్చారు.

English summary
YSR Congress party leader Ambati Rambabu pleaded High Court take action against ABN Andhrajyothy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X