బార్ గర్ల్స్‌తో చిందేసిన ఎమ్మెల్యే, కొత్త రకం ఆకర్షణ
National
oi-Srinivas
By Srinivas
|
జార్ఖండ్: ఓ మహనీయుని జయంతి వేడుకలో ఓ ప్రజాప్రతినిధి బార్ అమ్మాయిలతో చిందేసిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంది. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన యోధుడి జయంతి వేడుకల్లో ఆ రాష్ట్ర దుర్గి శాసనసభ్యుడు జగన్నాథ్ బెహదో బార్ అమ్మాయిలతో చిందేసి విమర్శలకు గురయ్యాడు. జార్ఖండ్ రాష్ట్రం రావడానికి కారణమైన ఓ మహనీయుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఎమ్మెల్యే జగన్నాథ్ బార్‌లో కార్యక్రమం నిర్వహించారట. అందులో చీలికలు పేలికలు అయిన దుస్తులతో అమ్మాయిలు డాన్సులు చేస్తుంటే అక్కడే కూర్చొని ఎమ్మెల్యే కాసేపు చూశారు.
ఆ తర్వాత ఆయనకు డాన్సు చేయాలని అనిపించినట్టుగా ఉంది. దీంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగి అమ్మాయిలతో వెర్రి డాన్సులు వేసి జనాలకు వెగటు కలిగేలా ప్రవర్తించాడు. బార్ డాన్సులు, వారితో ఎమ్మెల్యే వెగటు డాన్సులు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మహనీయున్ని కించపర్చడమేనని ప్రజలు ఆయనను ఈసడించుకుంటున్నారట.