వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం కొత్త పార్టీ: రాంరెడ్డి దామోదర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
న్యూఢిల్లీ: అవసరమైతే తెలంగాణ కోసం కాంగ్రెసు పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం రాత్రి న్యూఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవనంలో అన్నారు. తెలంగాణకు కేంద్రం అనుకూలంగా లేకుంటే అవసరమైన పక్షంలో కొత్త పార్టీ వస్తుంది. అప్పుడు ఎవరు తమతో కలిసి వస్తారో ఎవరు బయటకు వెళతారో చూడాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి మంత్రులతో పాటు ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తుందన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ నివేదిక కోసం ఎదురు చూడటం లేదని అధిష్టానం నిర్ణయం కోసమే వేచి చూస్తున్నామని చెప్పారు. కేంద్రానికి పలు సమస్యలతో పాటు తెలంగాణ ప్రధానమైన సమస్యే అన్నారు. ఆజాద్ తెలంగాణపై ఏ నిర్ణయం ప్రకటించక పోతే ఆయనతో సమావేశమైన తర్వాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమవుతామని చెప్పారు.

శ్రీకృష్ణ కమిటి నివేదిక, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభకోణాలు అంటూ చాలా గడువులు అయిపోయాయని ఇది తమ చివరి ప్రయత్నమన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ వద్దని అధిష్టానాన్ని కోరినప్పటికీ వినిపించుకోలేదని అక్కడి కాంగ్రెసు అభ్యర్థికి తమ మద్దతు ఉండదన్నారు. అధిష్టానం ఆదేశించినా ప్రచారానికి వెళ్లమన్నారు. రాజీనామా చేయమని డిమాండ్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎవరని ఆయన ప్రశ్నించారు. మొదట వారు రాజీనామాలు చేసి ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మేం రాజీనామాలు చేస్తామని చెప్పారు. ఒకరు చెప్పినంత మాత్రాన రాజీనామాలు చేయమన్నారు.

English summary
Former Minister Ramreddy Damodar Reddy said yesterday that they ready to start new party for Telangana if needed. He blamed TRS chief K Chandrasekhar Rao also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X