హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా లేఖలతో వచ్చిన టిడిపి తెలంగాణ నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బుధవారం తమ రాజీనామా పత్రాలతో అసెంబ్లీ చేరుకున్నారు. తెలంగాణ కోసం ఈ నెల 28న తాము రాజీనామా పత్రాలతో అసెంబ్లీకి వస్తామని రాజ్యాంగ సంక్షోభం సృష్టించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకునేందుకు తమతో తెలంగాణలోని కాంగ్రెసు తదితర పార్టీలు రావాలని ఇటీవలే వారు ప్రకటించారు. అన్నట్టుగానే వారు బుధవారం ఉదయం అసెంబ్లీకి రాజీనామా పత్రాలతో వచ్చారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఇతర పార్టీ శాసనసభ్యుల కోసం వారు నిరీక్షిస్తున్నారు. టిడిపిఎల్పీలో వారు భేటీ అయ్యారు. అయితే కాంగ్రెసు కలిసి వచ్చినా రాకున్నా రాజీనామా చేయాలని టిడిపిలోని కొందరు శాసనసభ్యులు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు.

ప్రత్యేక రాష్ట్రం సాధించే దిశలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించే రాజీనామాలకు తాము సిద్ధమని తాము రాజీనామాలతో సిద్ధంగా ఉన్నామని కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి సైతం తమతో కలిసి రావాలని మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ కేవలం తమ సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకే ప్రయత్నాలు చేస్తోందన్నారు. మర్రి చెన్నారెడ్డి 400 మంది తెలంగాణవాదులను బలి తీసుకుంటే టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావు 600 మందిని బలి తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెసు కలిసి వచ్చినా రాకున్నా తాము ఖచ్చితంగా రాజీనామా చేస్తామని మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమతో కాంగ్రెసు సైతం కలిసి వస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. కాలాయాపన సరికాదన్నారు. తాము రాజీనామా చేసి తెలంగాణ నేతలపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు.

English summary
Telangana Telugudesam Party mlas came with their resignations to assembly on wednesday. They said they were took resignation with speaker format. The demanded Congress mlas come with resignations for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X