హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కిన శంకరరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: ప్రస్తుత జౌళి శాఖ మంత్రి పి. శంకరరావు పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు ఓ టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేసింది. ఆ వార్తాకథనాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక గురువారం ప్రచురించింది. 2009 ఆఖరులో జరిగిన హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కార్పోరేటర్‌గా పోటీ చేయాలని ఆశపడిన ఓ నాయకుడి నుంచి శంకరరావు రెండు విడతలుగా పది లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆ వార్తాకథనం ఆరోపణ.

ఆ మొత్తాన్ని రెండు విడతలుగా శంకరరావు తీసుకున్నారని, రెండో విడత ఐదు లక్షల రూపాయలు తీసుకుంటూ న్యూస్ చానెల్ కెమెరాకు చిక్కారని సాక్షి దినపత్రిక రాసింది. టికెట్ ఆశించిన వ్యక్తితో జరిపిన సంభాషణలు టేపుల్లో రికార్డు అయినట్లు తెలిపింది. ఆ సంభాషణలను కూడా సాక్షి దినపత్రిక ప్రచురించింది. వైయస్ జగన్‌పై శంకరరావు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి, సిబిఐ దర్యాప్తునకు దారి తీసింది. అలాగే, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే శంకరరావు లంచం తీసుకున్న టేపుల వ్యవహారాన్ని ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.

English summary
A popular Telugu news channel on Wednesday aired two-year-old footages of the textile minister, Dr P. Shankar Rao, accepting Rs 10 lakh from an unidentified aspirant as a quid-pro-quo for arranging a Congress ticket during the last Hyderabad Municipal Corporation elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X