హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబునే ఇక్కడి నుండి పంపిస్తాం: టిడిపి ఎమ్మెల్యే జైపాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaipal Yadav
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం జరగలేదని అంటే ఆయనను తెలంగాణ ప్రాంతం నుండి పంపించేస్తామని అదే పార్టీకి చెందిన శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ గురువారం అన్నారు. పార్టీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి ప్రణబ్ ముఖర్జీ కమిటికీ లేఖ పంపించలేదని చెబితే ఆయనను ఇక్కడి నుండి పంపించేస్తామని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సంక్షోభంతోనే తెలంగాణ సాధ్యమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం గట్టిగా అభిప్రాయపడుతోందని ఆ రాజకీయ సంక్షోభం కోసం రాజీనామాలు చేసేందుకు కాంగ్రెసు ప్రజాప్రతినిధులను కలిసి రమ్మంటే వారెవరూ రాలేదన్నారు.

రాజీనామా చేసేందుకు వెనక్కి పోయిన కాంగ్రెసు నేతలు పిరికి పందలని విమర్శించారు. తెలంగాణ బూచి చూపి కావాలనే వారు దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ప్రకటించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెడితే అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలు బహిష్కరిస్తామనే అంశంపై చంద్రబాబుతో స్పష్టమైన ప్రకటన ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటన తెలంగాణ ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు.

ఐక్య ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తోడ్పాటునందించాలన్నారు. టిడిపి నేతలపై టిఆర్ఎస్ నేతల దాడి సరికాదన్నారు. ఎపికి కాంగ్రెసు శనిలా దాపురించిందన్నారు. కాగా గతంలోనూ సినీ హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రం చేస్తానని ప్రకటించిన సమయంలో తెలంగాణ టిడిపి నేతలం రాజీనామాలు చేసి బాలయ్యను ఆహ్వానించడానికి సిద్ధంగా లేమని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా బాబును గెంటి వేస్తామని ప్రకటించడం విశేషం.

English summary
Telangana Telugudesam Party MLA Jaipal Yadav warned TDP chief Nara Chandrababu Naidu today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X