వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి వివాదం: ప్రణబ్, చిదంబరం మధ్య ప్యాచప్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukharjee and P Chidambaram
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య నెలకొన్న వివాదానికి తెర పడింది. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి, హోం మంత్రి చిదంబరానికి మధ్య సంధి కుదిరింది. ప్రధానితో భేటీ తర్వాత ఇరువురు మంత్రులు సంయుక్తంగా ప్రకటన చేశారు. ప్రణబ్ ముఖర్జీ వివరణతో వివాదం ముగిసిందని చిదంబరం చెప్పారు. తాను పంపిన నోట్‌లోని అభిప్రాయాలు తన వ్యక్తిగతం కాదని, మీడియా దానిపై సొంత భాష్యాలు చెప్పిందని, వాటికి తాను బాధ్యుడిని కానని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంత్రుల బృందం నోట్‌నే తాను ప్రధానికి పంపానని, అది సమాచార మార్పిడి మాత్రమేనని ఆయన అన్నారు.

ప్రధానికి పంపిన నోట్‌లో వాస్తవాలతో పాటు అన్వయాలు, ఉటకింపులున్నాయని, అవి తన అభిప్రాయాలు కావని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిననప్పుడు ఆ ఇద్దరు మంత్రుల వెంట మరో ఇద్దరు మంత్రులు కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్ కూడా ఉన్నారు. వివాదం ముగిసినట్లేనని చిదంబరం అన్నారు. ఇద్దరు మంత్రులతో భేటీ తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు.

English summary
Seeking to put an end to the raging controversy surrounding the 2G note sent by the finance ministry to the PMO, finance minister Pranab Mukherjee on Thursday said that it did not reflect his views and was an inter-ministerial background paper on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X