డిఎస్ నోట తెలంగాణ పాట, రాష్ట్రం ఇవ్వాల్సిందే

D Srinivas
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందేననే పద్ధతిలో పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మాట్లాడారు.ప్రత్యేక రాష్ట్రాన్ని మినహా మరో ప్రత్యామ్నాయాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించరని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని, పండుగ రోజుల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు.

సకల జనుల సమ్మెను శాంతియుతంగా విరమింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమ్మె కారణంగా తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఉద్యోగులు సమ్మెకు కొంత విరామం ప్రకటించాలని ఆయన కోరారు. సమ్మె తదితర పరిణామాల కారణంగా త్వరలో తెలంగాణ వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారన్నారు. ఓ లక్ష్యంతో ముందుకు పోతున్న కాంగ్రెసు పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం చూడదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+