వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: శ్రీకృష్ణ కమిటీనే ఫాలో అయిన ఆజాద్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ శుక్రవారం కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో అందులో ఏముందోనని అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. రెండు నెలలుగా ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ ప్రజా ప్రతినిధులతో పలుమార్లు భేటీ అయి అనంతరం నివేదిక రూపొందించారు. గురువారం రాత్రి దాదాపు నిద్ర పోకుండానే నివేదికపై కుస్తీ పడ్డారట. నివేదికలోని అంశాలను తన సన్నిహితుల వద్ద కూడా ప్రస్తావించలేదట. అయితే అలాంటి ఆజాద్ నివేదిక కోసం ఇప్పుడు రాష్ట్రం యావత్తూ ఎదురు చూస్తోంది. అయితే ఆయన పొందుపర్చిన నివేదిక మొత్తం శ్రీకృష్ణ కమిటీ సూత్రీకరించిన ఆరో ప్రతిపాదననే అని తెలుస్తోంది.

కమిటీ ప్రతిపాదించిన ఆరో ప్రతిపాదనకు కాస్త మెరుగులు దిద్ది నివేదిక రూపొందించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాన్ని విడగొట్టకుండా సమైక్యాంగానే ఉంచి వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయాలని ఆయన అందులో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది. మూడు ప్రాంతాలకు వేరువేరుగా సహాయం ప్రకటించాలని, తెలంగాణ ఉద్యమం, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాన్ని ఎప్పటికీ సమైక్యంగా ఉంచకుండా భవిష్యత్తులో విభజించాలని కానీ ఇప్పటికిప్పుడు ఏం చేసినా ఇరు ప్రాంతాలలో భావోద్వేగాలు ఉబికి వస్తాయని ఆయన సూచించారని సమాచారం. ఇందుకోసం మధ్యేమార్గంగా ఆర్థిక మండళ్లు ఉత్తమమైన పరిష్కారమని అ తర్వాతా ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరుపుకుంటూ వెళ్లి ఏకాభిప్రాయం వచ్చాక విభజించాలని అందులో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, State incharge Ghulam Nabi Azad followed Srikrishna Committee sixth proposal to prepare his report on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X