వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రికి బాబు డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలో ఉన్న అవినీతి మంత్రులను వెంటనే బర్తరఫ్ చేసి రాష్ట్రానికి నీతివంతమైన పాలన అందించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిపరులకు అండగా నిలుస్తున్నాయని ఆరోపించారు. 2జి కుంభకోణంలో కేంద్రమంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం మధ్య ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మధ్య సయోధ్య కుదిర్చారే గానీ ఆ కుంభకోణంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

కుంభకోణాలపై కోర్టులు స్పందిస్తున్నాయి తప్పితే ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు పంట విరామాన్ని ప్రకటించారని దానిని చూసి ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
TDP chief Chandrababu Naidu demanded CM Kiran Kumar Reddy today that to take action on currupt ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X