విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్యే చిన్నం రాజీనామా, బాబుకు ఫ్యాక్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
విజయవాడ: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడు తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. వ్యవసాయం కోసం నీటి విడుదలలో నాగార్జున్ సాగర్ అధికారులు చూపుతున్న అశ్రద్ధకు నిరసనగా జిల్లాకు చెందిన నూజివీడు నియోజకవర్గం శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. కాగా మూడు రోజులగా సాగర్ కాలువల మూడో జోన్ చివరి ప్రాంతాలకు నీరు అందించాలని కోరుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావుతో కలిసి నూజివీడు సాగర్ డివిజన్ కార్యాలయం ముందు చిన్న రామకోటయ్య నిరవధిక దీక్ష చేపట్టారు.

నీళ్లు సరిగ్గా విడుదల చేయక పోవడంతో రైతులకు ఉపయోగపడని పదవి ఎందుకని చెబుతూ ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. నీటి విడుదలపై అధికారుల మాటలు విని సంతోషపడ్డామని అయితే ఇప్పటికీ నీరు విడుదల చేయక పోవడంతో ప్రజల ముందు తాము దోషులుగా నిలబడాల్సి వస్తోందన్నారు. అందుకు నిరసనగానే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

English summary
TDP Nuziveedu MLA Chinnam Ramakotaiah resigned for his post yesterday for not releasing sagar water. He sent his resignation letter to party chief Chandrababu Naidu by fax.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X