వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై మ్యాజిక్ ఫార్ములా ఉందా: కారత్ లేఖపై సింఘ్వీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Abhishek Manu Singhvi
న్యూఢిల్లీ: తెలంగాణపై సమస్య పరిష్కారానికి సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ వద్ద మ్యాజిక్ ఫార్ములా ఏమైనా ఉందా అని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ప్రశ్నించారు. తెలంగాణ సమస్యను వెంటనే పరిష్కరించాలని కారత్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. పరిష్కారం చూపని సలహాలు ఇవ్వడం ఎవరికైనా సులభమేనని ఆయన దండెత్తారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సమర్పించిన నివేదికను తమ అధిష్టానం పరిశీలిస్తోందని ఆయన అన్నారు. ప్రణబ్ ముఖర్జీ, ఆజాద్ సమస్య పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి మరింత సమయం అవసరమని ఆయన అన్నారు.

తెలంగాణ సమస్యపై సంప్రదింపులు లేకుండా ఏమీ చేయలేమని గులాం నబీ ఆజాద్ అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఇంకా సంప్రదింపులు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రతిష్టంభన ముగిసిపోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా, తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరం లేదని ప్రధానికి లేఖ రాయనున్నట్లు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్ధన్ చెప్పారు. ఆయనను సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కలిశారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

English summary
AICC spokesperson Abhishek Manu Singhvi fired at CPI general secretary Prakash Karat on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X