వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు ఆ ముగ్గురు నేతలూ అడ్డమేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharad - Farooq - Mamata
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను నాన్చడానికి కాంగ్రెసు అధిష్టానం కొత్త వ్యూహం అనుసరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో తేలుస్తామని ప్రకటించిన పార్టీ పెద్దలు తెలంగాణ అంశాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం నాన్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, మరిన్ని సంప్రదింపులు అంటూ పదే పదే కాంగ్రెసు నాయకులు అంటూ వస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చర్చలు జరగాలని అంటున్నారు. కాంగ్రెసు నేతలతో చర్చలు పూర్తయ్యాయని, మిగతా స్థాయిల్లో చర్చలు అవసరమని అంటున్నారు. అందులో భాగంగా యుపిఎ భాగస్వామ్య పక్షం నేతలను అడ్డు వేయాలనే ఎత్తుగడలో కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ఆలోచన చేస్తున్నారు.

తెలంగాణపై పార్టీ వైఖరి ప్రకటించకుండా తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ, ఎన్సీపి నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్డుల్లాలతో చర్చలు జరిపే నెపంతో, వారిని ఒప్పించే నెపంతో తెలంగాణ అంశాన్ని మరింత కాలం లాగాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ ముగ్గురు నేతలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారు. సంప్రదింపులంటూ ప్రారంభమైతే వారు తమ వ్యతిరేకతను వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. వారిని ఒప్పించే ప్రయత్నాలంటూ తెలంగాణ అంశాన్ని నాన్చడానికి కాంగ్రెసు అధిష్టానం ఉద్దేశించిందని అంటున్నారు.

ఆ ముగ్గురు నేతలు కూడా తెలంగాణను వ్యతిరేకించడానికి తమ రాష్ట్రాల్లోని పరిస్థితులే కారణమని అంటున్నారు. మహారాష్ట్రలో విదర్భ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ దశాబ్దాలుగా నలుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే విదర్భలో అగ్గి రాజుకునే అవకాశం ఉంది. గూర్ఖాలాండ్ సమస్యను పరిష్కరించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ మళ్లీ ముందుకు వస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు నాయకురాలు మమతా బెనర్జీ భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మరిన్ని కొన్ని కూడా రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉంది. దాంతో ఫరూఖ్ అబ్దుల్లా కూడా తెలంగాణను వ్యతిరేకించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణకు ఆ ముగ్గురు నేతల వైఖరిని అడ్డువేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that Congress high Command may use anti - Telangana stand of Mamata, Sharad Pawar and Farooq Abdullah to shelve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X