హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్సేసింది. ఆ కంపెనీ 140 మందికి పైగా ఉద్యోగులకు రెండు కోట్ల రూపాయల మేరకు టోకరా కొట్టింది. తమను మోసం చేసిన ఇన్ఫోటెక్ సిస్టమ్స్ కంపెనీపై దాదాపు 15 మంది ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసపోయిన ఉద్యోగుల కథనం ప్రకారం - కిరణ్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం శ్రీనగర్ కాలనీలోని ఎస్వీఆర్ టవర్స్‌లో ఆ సంస్థను ప్రారంభించాడు. శిక్షణతో పాటు ప్రాజెక్టు అనుభవాన్ని కల్పిస్తానని చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి 60 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశాడు. బిటెక్, ఎంసిఎ పూర్తి చేసినవారని చేర్చుకున్నాడు.

కిరణ్ 140 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకున్నాడు. వారికి శిక్షణ గానీ, ప్రాజెక్టు వర్క్ గానీ ఇవ్వలేదు. కొంత మంది ఏజెంట్ల ద్వారా కూడా ఈ సంస్థలో చేరారు. ఉద్యోగులకు అనుమానాలు కలుగకుండా ఒకటి రెండు సార్లు వారికి స్వీట్లు పంచిపెట్టి తమ సంస్థకు కొత్త ప్రాజెక్టు వచ్చిందని చెప్పాడు. గత వారం రోజులుగా అతను కార్యాలయానికి రాకపోవడం ఉద్యోగులకు అనుమానం వచ్చింది. అతనితో మాట్లాడడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Yet another software firm downed its shutters duping more than 140 employees to the tune of over Rs 2 crore. Nearly 15 employees of Infotech Systems Company approached the city police alleging that they were duped by the firm's managing director, Kiran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X