విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా నుండి హైదరాబాద్‌కు రహదారి బంద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
నల్లగొండ: తెలంగాణవాదులపై పోలీసుల లాఠీఛార్జ్‌కు నిరసనగా నల్లగొండ జిల్లా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన 24 గంటల పిలుపు మేరకు జిల్లాలో తెలంగాణవాదులు జాతీయ రహదారి తొమ్మిదిని దిగ్బంధం చేశారు. ఆంధ్రా ప్రాంతం నుండి ఒక్క బస్సు జిల్లాలో అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. నకిరేకల్ వద్ద తెలంగాణవాదులు రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకారుల రాస్తారోకో కారణంగా ఆంధ్రా ప్రాంతం నుండి వస్తున్న పలు లారీలు, ఇతర వాహనాలు రహదారి పైనే నిలిచి పోయాయి. దీంతో సుమారు పది కిలోమీటర్ల మేర ట్రాఫిగ్ జాం అయింది. వాడపల్లి, నాగార్జున సాగర్, కోదాడ తదితర ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్డు పైనే బైఠాయించారు.

రహదారుల దిగ్బంధం కారణంగా పోలీసులు హైదరాబాదు వెళ్లే వాహనాలను చిల్లకల్లు మీదుగా ఖమ్మం వైపు మళ్లిస్తున్నారు. ఐకాస 24 గంటల రహదారుల దిగ్బంధానికి పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసు శాఖ రహదారులపై భారీగా పోలీసులను మోహరించింది. పలు ప్రాంతాల్లో ముందస్తుగా టిఆర్ఎస్, జెఏసి నేతలను అరెస్టు చేశారు. నకిరేకల్‍లో రాస్తా రోకో చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Telangana JAC closed roads at Nalgonda district between Andhra and Hyderabad. Police arrested trs and JAC leaders who were sat on national high way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X