వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీ సత్యసాయి ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టపర్తి: శ్రీసత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్‌గా డాక్టర్ సఫాయా రాజీనామా చేశారు. సత్యసాయి భక్తుడిగా దాదాపు రెండుదశాబ్దాల పాటు ఆసత్రికి రెండు దశాబ్దాల పాటు సేవలందించారు. సత్య సాయి ఆస్పత్రిలో ఉన్నప్పుడు వైద్యసేవలను పర్యవేక్షించింది కూడా ఆయనే. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిరుడు బాబాకు విన్నవించగా మరికొద్దిరోజులు పదవిలో కొనసాగాలని సూచించారని తెలుస్తోంది. అయితే ఈ నెల 7వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.

తన పదవికి రాజీనామా చేయడంతో సోమవారం ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ సఫాయాకు అభినందన సభ ఏర్పాటు చేశారు. సభలో వైద్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. సఫాయా గతంలో ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ) డైరెక్టర్‌గా పనిచేశారు. అక్కడ పదవీవిరమణ అనంతరం పుట్టపర్తికి చేరుకుని 1992లో సత్యసాయిబాబా సూచనల మేరకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు చేపట్టారు.

మార్చి 28న సత్యసాయిబాబా అనారోగ్యంతో పుట్టపర్తి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఏప్రిల్ 24న మరణించారు. అప్పటి నుంచి సఫాయా తన విధుల్లో పూర్తిగా నిమగ్నం కావడం లేదని సమాచారం. 75 ఏళ్ల వయసులో విధులు నిర్వహించడం కష్టమని, తన పదవికి రాజీనామా చేస్తానని ట్రస్టు వారికి తెలిపినట్లు సమాచారం. దీంతో ఈనెల 7వ తేదీ నుంచి పూర్తిగా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that Sri Sathya Sai baba super specialty hospital director Safaya resigned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X