వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారాయణ మూర్తి వ్యాఖ్యలపై విరుచు పడ్డ చేతన్ భగత్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Chetan Bhagat-Narayana Murthy
న్యూఢిల్లీ: నిన్న న్యూయార్క్‌లో జరిగిన పూర్వ ఐఐటీయన్స్‌, పాన్‌ ఐఐటీయన్‌ల సమావేశంలో రోజు రోజుకు ఈ ప్రతిష్ఠాత్మకమైన కాలేజీలు చేరే విద్యార్థుల ప్రమాణాలు తగ్గుముఖం పట్టాయని, వీరికి శిక్షణ ఇచ్చి ఐఐటీ ప్రవేశ పరీక్షకు తయారు చేసే ఇచ్చే కోచింగ్‌ సెంటర్‌లు వారికి సరైన శిక్షన ఇవ్వడం లేదని నారాయణ మూర్తి వ్యాఖ్యానించగా, సుమారు 400 మందితో నిండిన సదస్సు ప్రాంగణం చప్పట్లతో మార్మ్రోగిన సంగతి తెలిసిందే.. భారత్‌లోని ఐఐటిల నుంచి బయటకు వచ్చి గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉన్నత విద్యావకాశాలను దక్కించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని నిన్న వన్ ఇండియా న్యూస్‌లో చదివాం..

ఐఐటీ ఉత్తీర్ణులై ఉద్యోగాల్లో చేరిన వారు గ్లోబల్‌ ఇన్సిస్టిట్యూట్‌ లలో తమ సత్తాను చాటలేక చతికిలపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై సీటు సంపాదించిన వారిలో 20 శాతం మంది మాత్రమే ప్రపంచంలోని అత్యుత్తుమ ఇంజినీర్లుగా కొనసాగుతున్నారని ఆయన అన్నారు. మిగతా 80 శాతం మంది విద్యార్థులు అనుకున్నంత రాణించలేకపోతు న్నారు. ఐఐటీలో ఎలాగో అలాగే సీటు సంపాదించిన తర్వాత అమెరికా లాంటి దేశాలకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వారి అసలు రంగ బయటపడు తుందని మూర్తి అన్నారు.

ఈరోజు నారాయణ మూర్తి వ్యాఖ్యలపై అత్యధిక పుస్తకాలు అమ్ముడైన రచయిత, ఐఐటీ పూర్వ విద్యార్ది 'చేతన్ భగత్' తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే చేతన్ భగత్ తన ట్విట్టర్ ఎకౌంట్లో ఇన్పోసిస్ మాజీ ఛైర్మన్ నారాయణ మూర్తి మీద కౌంటర్లు సంధించారు. ఇందుకు కారణం నారాయణ మూర్తి ఐఐటీలలో నైపుణ్యం లేని విద్యార్దులు ఉన్నారని అన్నందుకు. ఇంతకీ తన ట్విట్టర్ ఎకౌంట్లో చేతన్ భగత్ ఏమని ట్వీట్ చేశారంటే..

ట్వీట్ 1: It is ironic when someone who runs a body shopping company and calls it hi-tech, makes sweeping comments on the quality of IIT students.

ట్వీట్ 2: Mr murthy had a point, but wish he wasn't so sweepingly high handed. Fix the system. No point judging students.

ట్వీట్ 3:IITians have made a great contribution in making Infosys what it is. Hope people remember that.

ఈ సందర్బంలో నారాయణ మూర్తిపై చేతన్ భగత్ మూర్తి ఐఐటి స్టూడెంట్స్‌పై చేసినటువంటి కామెంట్స్ ఆయన వ్యక్తిత్వాన్ని తెలిపే విధంగా ఉన్నాయని ఉన్నారు. మూర్తి ఐఐటీ విద్యార్దులనుద్దేశించి అలాంటి కఠినమైన మాటలను మాట్లాడి ఉండకూడదని అన్నారు. గతంలో పోల్చితే ఇప్పుడున్న ఐఐటీ స్టూడెంట్స్ చాలా కష్టపడుతున్నారని తెలిపాడు. మూర్తి స్డూడెంట్స్‌ని జడ్జి చేసిన విధానం తప్పుగా ఉందన్నారు. అలా కఠినంగా మాట్లాడకుండా విద్యార్దులకు తనదైన శైలిలో వారికి సలహాలు ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం అని అన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇన్పోసిస్ ఈరోజు దేశంలోని ఐటి రంగంలో రెండవ స్దానంలో ఉండడానికి ఐఐటియన్లు కూడా వారి వంతు సేవలను అందించడం జరిగిందన్నారు.

పాఠకులకు ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఇన్పోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, ప్రసుతం ఆధార్ కార్డ్ కార్యక్రమానికి చైర్మన్‌గా కొనసాగుతున్న నందన్ నీలేకని కూడా ఒకప్పటి ఐఐటీ పూర్వ విద్యార్దులే.

English summary
Bestselling author and ex-IITian Chetan Bhagat has offered a sharp counter punch to Infosys chairman emeritus N R Narayana Murthy's remark that the standard of students in the IITs is declining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X